Friday, April 23, 2010

రవ్వ కేసరి

రవ్వ కేసరి






కావలసిన పదార్ధాలు ;-

బొంబాయిరవ్వ ; 1 కప్పు
పంకాదార ; 1 కప్పు
ఫుడ్ కలర్ ; చిటికెడు
పాలు ; 1 కప్పు
జీడిపప్పులు ; 2 స్పూన్స్
కిస్మిస్ ; 2 స్పూన్స్
ఇలాచి ; 4 పొడిచేసి పెట్టుకోవాలి
నెయ్యి ; అర కప్పు
నీళ్ళు ; 2 కప్పులు





తయారు చేసే విధానం ;-

ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి చిన్న మంటలో పెట్టాలి.ఆ గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుని దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తరవాత రెండు స్పూన్స్ నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి.తరవాత గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి బుడగలు వచ్చేదాకా మరగ నివ్వాలి.అప్పుడు కప్పు పంచదారను మరిగే నీటిలో వెయ్యాలి.తరవాత పొంగు వచ్చాక కప్పు పాలలో ఫుడ్ కలర్ ని కలిపి ఆ పాలను కూడా పోసేయాలి.పాలు పోసాక పొంగుతాయి కనుక సన్నని మంట మీద పెట్టి పొంగు బాగా వచ్చాక పక్కన పెట్టిన రవ్వను గిన్నెలో పోస్స్తు గరిటతో వుందా కట్ట కుండ కలపాలి.తరవాత ఇలాచి పౌడర్ ,జీడిపప్పు,కిస్మిస్లు వేసి కలపాలి.నెయ్యి కూడా వేసి కొంచం దగ్గర పడే దాక సన్నని సెగ పిన కలుపుతూ వుండాలి.అంతే ఘుమ ఘుమ లాడే వేడి వేడి రవ్వ కేసరి రెడీ.

పకోడీ


పకోడీ:
కావలసిన పదార్ధాలు
శనగ పిండి - 1/2 kg
బియ్యం పిండి - 150 grms
ఉల్లిపాయ - 4 పెద్దవి -ముక్కలు చిలికలుగా కోసుకోవాలి
10 పచ్చి మిరపకాయలు & చిన్న ముక్క అల్లం కలిపి నూరుకోవాలి
ఉప్పు - తగినంత
కరివేపాకు & కొత్తిమీర - 1 కట్ట
తయారుచేయు విధానం
శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, అల్లం, పచ్చి మిరపకాయ ముద్ద, కరివేపాకు, కొత్తిమీర కలిపి కొద్దిగా నీరు తో గట్టిగా కలపాలి.
ఇది బాగా పిసికి మరుగుతున్న నూనెలో పిండిని కొద్ది కొద్దిగా వేసి వేయించాలి.

గట్టి పకోడి:
పకోడీ కరకరలాడుతూ గట్టిగా ఉంమెత్తని పకోడి :
పకోడి మెత్తగా, గుల్లగా ఉండాలంటే బియ్యం పిండి వెయ్యకుండా, కొద్దిగా వంటసోడా కలపాలి. కొంచెం నీరు పోసి కలుపుకోవాలి.
.
మెత్తని పకోడి :
పకోడి మెత్తగా, గుల్లగా ఉండాలంటే బియ్యం పిండి వెయ్యకుండా, కొద్దిగా వంటసోడా కలపాలి. కొంచెం నీరు పోసి కలుపుకోవాలి.
.
డాలంటే నీరు చాలా తక్కువ వెయ్యాలి . బియ్యం పిండి తప్పకుండా కలపాలి.

Wednesday, February 10, 2010

Majjiga Pulusu - మజ్జిగ పులుసు


కావాల్సిన పదార్ధాలు

పెరుగు ; అర కేజీ
సెనగపిండి ;100 గ్రాములు
సొరకాయ; పావు కేజీ
బెండకాయ ; పావు కేజీ
వంకాయలు ; సన్నగా పొడవుగా ఉండేవి 2
బచ్చలి లేక తోటకూర ; పెద్ద కట్టలు 4
పచ్చిమిరపకాయలు ; 16
ఆవాలు ; అర టీ స్పూన్
మెంతులు ; ఒక టీ స్పూన్
నెయ్యి ; రెండు టీ స్పూన్స్
పసుపు ; ఒక టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు ; 6
ఇంగువ ; ఒక టీ స్పూన్
ఉప్పు ; నలుగు టీ స్పూన్స్
తయారుచేసే విధానం ;-

ముందుగ సోరకయను ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో నీరు పోసి ఈ సొరకాయ ముక్కలు బచ్చలి కానీ లేకపోతె తోటకూర అయిన ముక్కలతో పాటుగా సన్నగా తరిగి ఉడికించాలి. అది వుడికే లోపుగా పెరుగుని తీసుకుని అందులో సెనగపిండి ,ఉప్పు ,పసుపు కొద్దిగా నీరు పోసి కవ్వం తో పిండి ఉండలు కట్టకుండా పెరుగు బిళ్ళలు లేకుండా మజ్జిగా లాగ తయారు చెయ్యాలి.గిన్నెలో ముక్కలు వుడికిన తరువాత తయారు చేసి పెట్టుకున్న మజ్జిగను పోసి బెండకాయ ముక్కలు,వంకాయ ముక్కలు,పచ్చిమిరప ముక్కలు వేసి పులుసు కాగే వరకు సన్నని సెగ మీద గరిటతో కలుపుతూ వుండాలి.మజ్జిగకి పొంగే గుణం వుంది కనుక కస్స్త పెద్ద గిన్నెలో అయతే పొంగి కిందకు పడకుండా వుంటుంది.పులుసు పొంగు తగ్గిపోయి కాగిన తరువాత బాన్డీని పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి ఇంగువ,మెంతులు,ఆవాలు ,ఎండుమిరప ముక్కలు వేసి పోపు వేయించి పులుసులో కలపాలి.అంతే చక్కని చిక్కని ఘుమ ఘుమ లాడే మజ్జిగ పులుసు రెడీ.

Maamidikaya Pulihora - Mango Pulihora - మామిడి కయ పులిహోర


కావలసిన పదార్ధాలు

బియ్యం ; ఒక కేజీ
మామిడికాయలు ; 3
పసుపు ; 2 టీ స్పూన్స్
ఉప్పు ; 4 టీ స్పూన్స్
సెనగపప్పు ; 4 టేబుల్ స్పూన్స్
మినపపప్పు ; 3 టేబుల్ స్పూన్స్
పల్లీలు; 2 టేబుల్ స్పూన్స్
ఎండుమిరపకాయలు ; 15
పచ్చిమిరపకాయలు; 20
ఆవాలు ; 2 టీ స్పూన్స్
అల్లం ; 2అంగుళాల ముక్క
కరివేపాకు ; 2 కట్టలు
ఇంగువ ; 1 టేబుల్ స్పూన్
నూనె ; 3 గరిటెలు

తయారుచేసే విధానం ;

ముందుగ బియ్యం కడిగి ఉడికించి ఒక పెద్ద బేసిన్లో ఉండలుగా ఉండకుండా పొడిపొడిగా ఉండేట్టుగా అన్నం ఆరబెట్టాలి.తరవాత ఒక బాండి తీసుకుని 3 గరిటెల నునే పోసి అందులోనే మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు,ఇంగువ ఎండుమిరప ముక్కలు , 4మెంతి గింజలు పసుపు వేసి దోరగా వేయించాలి .అల్లం ముక్కని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి . మామిడి కాయలకు పీలర్తో పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.దోరగా వేగిన పోపులో పచ్చి మిరప ముక్కలు ,అల్లం,కరివేపాకు ,ఉప్పు వేసి ఒక నిముషం తరవాత గ్రైండ్ చేసిన మామిడికాయ గుజ్జుని వేసి 5 నిమిషాలు ఉంచి బేసిన్లోని అన్నంలో బాగా కలపాలి. అంతే ఘుమగుమ లాడే వేడి వేడి మామిడి కయ పులిహోర రెడీ.

Maggy Noodules - మ్యాగీ నూడుల్స్



నాకు ఈజీగా తయారు చేయటం వచ్చేది మ్యాగీ నూడుల్స్.టేస్టీ గా వుంటుంది.మీరు కూడా టేస్ట్ చేయండి.
ఏం కావాలంటే?-
మ్యాగీ నూడుల్స్ -200 గ్రా
ఉడికించిన బీన్స్ ,బటానీ,క్యారట్ -1/4 కప్
ఉల్లిగడ్డ -1
చిల్లి సాస్ 1/2 sp
టమోటో-1tsp
ఎగ్స్-2
గరం మసాల పొడి-1/4 sp
నూడుల్స్ ముందుగ ఉడికించి వడకట్టి పైన చన్నీళ్ళు పోసి నీరు వాడనియ్యాలి.
పాన్ లో ౩ sp నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు,vegetables, సాస్ వేసి వేయించాలి.సాల్ట్ ,నూడుల్స్ ,గరం మసాల పొడి,కొత్తిమీర వేసి వేయించి దించాలి.ఇంకో పాన్ లో ఎగ్ ని కొట్టి 2 spns నూనె లో వేసి పొడిగా వేయించి noodles పైన చల్లి onion రింగ్స్,కీరా.tomato తో garnish చెయ్యాలి.
ఎలా వుంది? బాగుందా?

Chintapandu Pulihora-చింతపండు పులిహోర


కావలసిన పదార్ధాలు

బియ్యం ; ఒక కేజీ
చింతపండు ; పావుకేజీ
పసుపు ; 2 టీ స్పూన్స్
ఉప్పు ; 4 టీ స్పూన్స్
సెనగపప్పు ; 4 టేబుల్ స్పూన్స్
మినపపప్పు ; 3 టేబుల్ స్పూన్స్
పల్లీలు; 2 టేబుల్ స్పూన్స్
ఎండుమిరపకాయలు ; 15
పచ్చిమిరపకాయలు; 20
ఆవాలు ; 2 టీ స్పూన్స్
అల్లం ; 2అంగుళాల ముక్క
కరివేపాకు ; 2 కట్టలు
ఇంగువ ; 1 టేబుల్ స్పూన్
నూనె ; 3 గరిటెలు


తయారుచేసే విధానం ;

ముందుగ బియ్యం కడిగి ఉడికించి ఒక పెద్ద బేసిన్లో ఉండలుగా ఉండకుండా పొడిపొడిగా ఉండేట్టుగా అన్నం ఆరబెట్టాలి.తరవాత ఒక బాండి తీసుకుని 3 గరిటెల నునే పోసి అందులోనే మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు,ఇంగువ ఎండుమిరప ముక్కలు , 4మెంతి గింజలు పసుపు వేసి దోరగా వేయించాలి .అల్లం ముక్కని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .చింతపండుని ముందే నీరు పోసి నానపెట్టి ఉంచుకుని రసం తీసి పెట్టుకోవాలి.పోపు దోరగా వేగాగానే పచ్చిమిరప ముక్కలు ,కరివేపాకు ,అల్లం,ఉప్పు వేసి ఒక నిముషం తరవాత చింతపండు రసం పోసేసి ఒక పది నిముషాలు ఉడక నిచ్చి బేసిన్లోని అన్నం లో పోసి బాగా కలపాలి.అంతే ఇంక ఘుమఘుమ లాడే చింతపండు పులిహోర రెడీ .

Bobbattlu బొబ్బట్ల


కావలసిన పదార్థాలు:
మైదా : ఒక కప్పు
ఉప్పు : 1/2 టేబుల్‌ స్పూన్‌
చక్కెర : ఒక టేబుల్‌ స్పూన్‌
నూనె : 4-5 టేబుల్‌ స్పూన్లు
నీరు : సరిపడినంత
(వీటన్నింటి కలిపి చపాతీ పిండి కలుపుకోవాలి)

శనగ పప్పు : ఒక కప్పు
బెల్లం తురుము : ఒక కప్పు
తురిమిన కొబ్బరి : పావు కప్పు
యాలకులు : రెండు

తయారు చేసే విధానం:
శనగపప్పును ఉడికించి, నీళ్లు వంచి చల్లార్చి, బెల్లం తురుము, యాలకులు కలుపుకొని పొడిగా రుబ్బుకోవాలి, తరువాత కొబ్బరి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

మైదా, ఉప్పు, చక్కెర, నూనె కలిపి పెట్టుకున్న ముద్దల్లోంచి కొంత మిశ్రమాన్ని తీసుకుని నూనె సహాయంతో చదునుగా ఒత్తుకోవాలి. ఇందులో శనగపిండి మిశ్రమాన్ని పెట్టి ఉండచేయాలి. తరువాత మరలా చపాతీలా ఒత్తుకోవాలి. దీన్ని పైనం పైన గోధుమ రంగు వచ్చే దాకా కాల్చాలి. కాల్చేటప్పుడు నెయ్యి వేసుకోవాలి. అంతే వేడి వేడిగా బొబ్బట్లను నెయ్యితో వడ్డించండి.