Friday, April 23, 2010

రవ్వ కేసరి

రవ్వ కేసరి






కావలసిన పదార్ధాలు ;-

బొంబాయిరవ్వ ; 1 కప్పు
పంకాదార ; 1 కప్పు
ఫుడ్ కలర్ ; చిటికెడు
పాలు ; 1 కప్పు
జీడిపప్పులు ; 2 స్పూన్స్
కిస్మిస్ ; 2 స్పూన్స్
ఇలాచి ; 4 పొడిచేసి పెట్టుకోవాలి
నెయ్యి ; అర కప్పు
నీళ్ళు ; 2 కప్పులు





తయారు చేసే విధానం ;-

ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి చిన్న మంటలో పెట్టాలి.ఆ గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుని దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తరవాత రెండు స్పూన్స్ నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి.తరవాత గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి బుడగలు వచ్చేదాకా మరగ నివ్వాలి.అప్పుడు కప్పు పంచదారను మరిగే నీటిలో వెయ్యాలి.తరవాత పొంగు వచ్చాక కప్పు పాలలో ఫుడ్ కలర్ ని కలిపి ఆ పాలను కూడా పోసేయాలి.పాలు పోసాక పొంగుతాయి కనుక సన్నని మంట మీద పెట్టి పొంగు బాగా వచ్చాక పక్కన పెట్టిన రవ్వను గిన్నెలో పోస్స్తు గరిటతో వుందా కట్ట కుండ కలపాలి.తరవాత ఇలాచి పౌడర్ ,జీడిపప్పు,కిస్మిస్లు వేసి కలపాలి.నెయ్యి కూడా వేసి కొంచం దగ్గర పడే దాక సన్నని సెగ పిన కలుపుతూ వుండాలి.అంతే ఘుమ ఘుమ లాడే వేడి వేడి రవ్వ కేసరి రెడీ.

1 comment:

  1. I really like Andhra Recipes......
    Mostly like this type Recipes........
    Please shere here for more Recipes.......
    Andhra Recipes

    ReplyDelete